Sunday, September 6, 2009

జనవరి-3

ఈ రోజు ఆఫీసులో మీటింగు ప్రొజక్ట్ పని గురించి, ఆఫీసు ముగిసేటప్పటికి ఆలస్యం అయ్యింది.అదరబదరాగా బయలుజేరాను తను ఈ రోజు కనబడుతుందో లేదో అని బండి వేగం పెంచాను తనని త్వరగా చూడాలని, అక్కడికి చేరాను బండి పక్కకు పెట్టి తను కూర్చునే ప్రదేశానికి చేరాను ఆశగా, కాని తను లేదు మనసులో ఎందుకో ఒక చిన్న బాధ,బహుశ తన నేస్తం కనబడక మనసు బాధపదుతున్నట్లుంది. ఆ దిగులుతోనే ఇంటికి వచ్చాను. కాసేపు ఒక్కడినే కూర్చోని ఆలోచించాను అరే ఎవరు అసలు తను నిన్న గాక మొన్న చూశాను తనని అలాంటిది ఎందుకు నా మనసు తనకోసం ఎదురు చూస్తుంది,ఎందుకు తనని కలవాలని ఆరాటపడుతుందా అని? కొంచెం సేపు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను, ఇంకా రేపటి నుండి తన కోసం వెళ్ళకూడదని,ఇంక నా పనిలో నిమగ్నమవాలని.

2 comments:

  1. మరీ ఒక్కో పేరా ఒక్కో పోస్ట్ కాకుండా కొంచెం కథని ముందుకి నడిపించండి చదివేవాళ్ళకి బాగుంటుంది! ఏమీ అనుకోకండే ఇలా చెప్పానని!

    ReplyDelete
  2. నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
    నా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను
    మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
    ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
    Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
    https://www.youtube.com/watch?v=RywTXftwkow

    ReplyDelete