Sunday, September 6, 2009

జనవరి-3

ఈ రోజు ఆఫీసులో మీటింగు ప్రొజక్ట్ పని గురించి, ఆఫీసు ముగిసేటప్పటికి ఆలస్యం అయ్యింది.అదరబదరాగా బయలుజేరాను తను ఈ రోజు కనబడుతుందో లేదో అని బండి వేగం పెంచాను తనని త్వరగా చూడాలని, అక్కడికి చేరాను బండి పక్కకు పెట్టి తను కూర్చునే ప్రదేశానికి చేరాను ఆశగా, కాని తను లేదు మనసులో ఎందుకో ఒక చిన్న బాధ,బహుశ తన నేస్తం కనబడక మనసు బాధపదుతున్నట్లుంది. ఆ దిగులుతోనే ఇంటికి వచ్చాను. కాసేపు ఒక్కడినే కూర్చోని ఆలోచించాను అరే ఎవరు అసలు తను నిన్న గాక మొన్న చూశాను తనని అలాంటిది ఎందుకు నా మనసు తనకోసం ఎదురు చూస్తుంది,ఎందుకు తనని కలవాలని ఆరాటపడుతుందా అని? కొంచెం సేపు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను, ఇంకా రేపటి నుండి తన కోసం వెళ్ళకూడదని,ఇంక నా పనిలో నిమగ్నమవాలని.

Tuesday, September 1, 2009

జనవరి-2

ఈ రోజు ఆఫీసుల మీటింగ్ అందుకే లేటయింది, చాలా అలసటగా ఇంటికి బయలుజేరాను,రోజులాగానే ట్రాఫిక్ జామొ బైక్ హారన్లు,వాహనాల మోతలతో తల పట్టేసినట్లుంది, ఏదో ఆలోచిస్తూ ఆ గోలలొనే ఇరుక్కుని ఉన్నాను.ఆ సమయంలో అదే పరిమళపు చిరుగాలి మళ్ళీ మనసుకి తగిలింది,ఆశగా అటుతిరిగి చూశాను తనే, సందేహం లేదు.వెంటనే నా బండిని పక్కన పార్క్ చేసి ఆశగా తను ఉన్న బెంచి వైపు పరిగెత్తాను,రోడ్డు దాటి తన బెంచి దగ్గరకు చేరాను,అంతలోనే తను మాయమయ్యింది, అంతే ఒక్కసారిగా గుండెలో ఉన్న ఆనందమంతా ఆవిరయ్యింది..కానీ ఎక్కడో ఒక ఆనందం తనని చూసినందుకు,ఎందుకో మనసులో గట్టి నమ్మకం కలిగింది మళ్ళీ తను రేపు ఇక్కడికే వస్తుందని,ఆ ఆనందంలోనే ఇంటికి తిరుగు ప్రయాణం కట్టాను.